Site icon NTV Telugu

Shyam Saran Negi: స్వతంత్ర భారత తొలి ఓటర్ కన్నుమూత

India's First Voter Shyam Sharn Negi

India's First Voter Shyam Sharn Negi

India’s first voter Shyam Saran Negi passes away at 106: స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ కల్పాలోని తన స్వస్థలంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రెండు రోజుల తర్వాత ఆయన మరణించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ 14వ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. రెండు రోజుల క్రితమే అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన మరణించడం పట్ల హిమాచల్ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. దేశంలో తొలి ఓటర్ గా నమోదు అయిన శ్యాం శరణ్ నేగి 1951 అక్టోబర్ 23న కల్పాలోని పోలింగ్ బూత్ లో మొదటి ఓటు వేశారు. ఈ ఏడాది నవంబర్ 2న 34వ సారి ఓటు వేశారు.

Read Also: K.A.Paul: ఎన్‌కౌంటర్‌ చేయిస్తారేమో అని భయపడ్డా

ఆయన మరణంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ స్వతంత్ర భారత తొలి ఓటరు, కిన్నౌర్‌కు చెందిన శ్యామ్‌ శరణ్‌ నేగీ మరణవార్త వినడం బాధాకరం’’ అని సీఎం ట్వీట్‌ చేశారు. భారతదేశ తొలి ఓటర్ అయిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి ఈ ఉదయం ఆయన స్వస్థలం కల్పాలో కన్నుమూశారు.. ప్రభుత్వ గౌరవాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కిన్నౌర్ కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల ఆయన ఓటేసిన సందర్భంలో ప్రధాని మోదీ.. ‘‘ఇది అభినందనీయం.. యువ ఓటర్ల ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రేరణగా ఉపయోగపడుతుంది.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు.

1951 నుంచి వరసగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు శ్యాంశరణ్ నేగి. జూలై 1917లో జన్మించారు నేగి. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన పేరు మారుమోగింది. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 సార్లు ఓటేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నేగి ఏనాడు కూడా తన ఓటు హక్కు అవకాశాన్ని వదులుకోలేదని.. తన చివరి రోజుల్లో కూడా ఓటు వేశారని హిమాచల్ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version