Site icon NTV Telugu

Indigenous Bullet Trains: 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్..

Indigenous Bullet Trains

Indigenous Bullet Trains

Indigenous Bullet Trains: భారతదేశం తన తొలి స్వదేశీ ‘‘బుల్లెట్ ట్రైన్’’ తయారీకి సిద్ధమవుతోంది. మొదటి బుల్లెట్ ట్రైన్ బెంగళూర్‌లో తయారు చేయబడుతోందని అంతా అనుకుంటున్నారు. దీని వేగం గంటలకు 280 కి.మీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపరేషనల్ స్పీడ్ 250 వేగం ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది.

భారత్ మొట్టమెదటి సారిగా స్వదేశీయంగా నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ రూపకల్పన, తయారీ, కమీషన్ కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని BEML(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్)తో రూ. 866.87 కోట్ల విలువైన ఒప్పందం కుదరించింది. ఇండియన్ రైల్వేస్ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఇచ్చిన ఆర్డర్ ప్రకారం.. రెండు హైస్పీడ్ ట్రెన్ సెట్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ట్రైన్‌లో 8 కోచ్‌లు ఉండనున్నాయి. BEML ఒక్కో కోచ్‌కు రూ. 27.86 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం కాంట్రాక్ట్ విలువలోనే డిజైన్ ఖర్చులు, వన్-టైమ్ డెవలప్‌మెంట్ ఖర్చులు, నాన్-రికరింగ్ ఛార్జీలు , ఫిక్చర్‌లు, టూలింగ్, టెస్టింగ్ సౌకర్యాల ఖర్చులను కూడా కవర్ అవుతాయని చెప్పింది.

Read Also: Water Samples: కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో 44 గ్రామాల్లో నీటి శాంపిల్స్ సేకరణ

అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్‌లకు జపనీస్ సాంకేతికతను ముందుగా భారత్ రైల్వేలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. చర్చలు అసంపూర్తిగా ఉన్నాయి. దీని ఫలితంగానే భారతదేశం ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసే రైళ్లను తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా BEML కోట్ చేసిన ధర, బుల్లెట్ రైళ్ల కోసం జపాన్ కోట్ చేసిన ధర రూ.46 కోట్ల కన్నా తక్కువ. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తులో భారతదేశం అంతటా బుల్లెట్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టులకు ఊతం ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

భారత్ దేశీయంగా అభివృద్ధి చేయబోతున్న బుల్లెట్ ట్రైన్ గంటకు 280 కి.మీ వేగంతో పరుగెడుతుంది. ముందుగా అనుకున్న జపనీస్ షింకన్‌సెన్ E5 సిరీస్ వేగం గంటకు 320 కి.మీ ఉంది. స్వదేశీ ట్రైన్లను BEML యొక్క బెంగళూరు సదుపాయంలో ఉత్పత్తి చేస్తుంది. 2026 నాటికి డెలివరీ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇవి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కాన్ఫిగరేషన్‌లను ఆధునిక సౌకర్యాలతో కలిగి ఉంటాయి, వీటిలో రిక్లైనింగ్ మరియు రొటేటబుల్ సీట్లు, నిరోధిత చలనశీలత కలిగిన ప్రయాణీకులకు వసతి మరియు ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి.

Exit mobile version