NTV Telugu Site icon

G20 Summit: జీ20 సదస్సుపై చైనా అక్కసు.. పాకిస్తానే కాస్త నయం..

Pm Modi

Pm Modi

G20 Summit: భారతదేశం జీ20 సమావేశాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు డ్రాగన్ కంట్రీ చైనా, దాయాది దేశం తట్టుకోలేకపోతున్నాయి. భారత పరపతి పెరగడాన్ని చైనా మీడియా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ ఈ సదస్సును తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఇక పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం దాచకుండా తన పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించింది. అంతర్జాతీయ మీడియా భారత ప్రయత్నాలను మెచ్చుకుంటే, చైనా మాత్రం ‘భారతదేశ భ్రమ’ అంటూ వ్యాఖ్యానించింది.

చైనా ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషన్ స్టడీస్ కథనంలో ప్రధాని నరేంద్రమోడీ భారతదేశాన్ని ‘ప్రపంచ అగ్రగామి శక్తి’గా ధృవీకరించాలని జీ20ని సువర్ణావకాశంగా పరిగణించారని పేర్కొంది. భారత్ సూపర్ పవర్ కావాలనే కల ఆదర్మప్రాయమైనదని, అయితే ఈ క్రమంలో అనేక క్రూరమైన ఎదురు దెబ్బలు ఉంటాయని, జీ 20 సమ్మిట్ నుంచి భారత్ ఎక్కువగా ఆశిస్తోందని, సూపర్ పవర్ కావాలనే భ్రమను ప్రతిబింభిస్తోందని గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

Read Also: US Crime: అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏపీ విద్యార్థిని మృతి.. నవ్వుతున్న పోలీసులు

ఇదిలా ఉంటే చైనాతో పోలిస్తే పాకిస్తాన్ మాత్రం తన నిరాశను వ్యక్తం చేసింది. తమ దేశ పరిస్థితిని చూపిస్తూ తనను తాను నిందించుకుంది. భారత్ నిర్వహించిన జీ20 సదస్సు నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం ప్రేక్షకుడిగా మారిపోయిందని ప్రముఖ పాక్ మీడియా డాన్ వెల్లడించింది. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఇజ్రాయిల్ ని అరబ్ దేశాలతో అనుసంధానించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) లో భాగంగా చైనా, పాకిస్తాన్ లో సీపెక్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు చెక్ పెట్టేలా కొత్త ప్రాజెక్టుపై జీ20 సమావేశంలో ఒప్పందం కుదిరింది. భారత్ ప్రభావం పెరగడం, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి అక్కడి మీడియా ఏం దాచకుండా ఉన్నటి ఉన్నట్లు చెప్పింది. ప్రపంచ ఆర్ఠిక-భౌగోళిక విషయాల్లో ముఖ్య దేశాలతో ఆటగాళ్లు అయితే మేం కేవలం ప్రేక్షకులమే అని చెప్పింది.

రియాల్ భారత్ దారుణమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించింది. అయినా కూడా పాశ్చాత్య దేశాలు, పాకిస్తాన్ సోదరులైన ముస్లిం దేశాలు కూడా భారత్ తో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపించడం ఆందోళనలను కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మరోవైపు ది వాషింగ్టన్ పోస్ట్, యూకే టెలిగ్రాఫ్ వంటి అంతర్జాతీయ మీడియాలు మాత్రం భారత్, ప్రధాని మోడీని తెగ పొగిడాయి.