NTV Telugu Site icon

National Flag: 18 ఏళ్ల పాకిస్థాన్ రికార్డును బద్దలుకొట్టిన భారత్

National Flag

National Flag

జాతీయ పతాకానికి సంబంధించి పాకిస్థాన్ నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును భారత్ బద్దలుకొట్టింది. బీహార్‌ జగదీష్‌పూర్‌లో శనివారం నాడు సుమారు 77,900 మంది ప్రజలు ఒకేసారి భారత జాతీయ పతాకాలను చేతిలో పట్టుకుని గాలిలో ఊపుతూ రికార్డు సృష్టించారు. ఇది ఓ రికార్డు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి గిన్నిస్ రికార్డు సంస్థ ప్రత్యేకంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ హాజరయ్యారు. అంతేకాకుండా 77 వేల మంది పౌరులు హాజరై వందేమాతరం ఆలపించారు. వీళ్లంఆ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.

గతంలో అత్యధిక మంది ప్రజలు జాతీయ జెండాలను పట్టుకున్న రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. 2004లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 56వేల మంది ప్రజలు వారి జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో ఊపుతూ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పాకిస్థాన్ కన్నా 19 వేల మంది ప్రజలు అధికంగా మన జాతీయ జెండాలను చేత పట్టుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా నినాదాలు చేస్తూ.. చరిత్రను లిఖించారు.