NTV Telugu Site icon

Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్‌లోని ఇండియన్స్‌కి కేంద్రం జాగ్రత్తలు..

Israel Hezbollah

Israel Hezbollah

Israel-Hezbollah: ఇజ్రాయిల్, మిలిటెంట్ సంస్థ హిజ్బోల్లా మధ్య ఘర్షణ తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది. శనివారం లెబనాన్ నుంచి హిజ్బోల్లా మిలిటెంట్ల దాడి చేయడంతో ఇజ్రాయిల్ గోలన్ హైట్స్‌లో పిల్లలతో సహా 12 మంది మరనించారు. ఈ రాకెట్ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయిల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం

ఇదిలా ఉంటే, ఈ ఘర్షణ వాతావరణం కారణంగా లెబనాన్ బీరూట్ విమనాశ్రయాలని విమానాలు రద్దు చేయబడటంతో పాటు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ డ్రోన్ దాడిలో లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ పరిణామాలపై అలర్ట్ అయింది. లెబనాన్‌లోని భారతీయులు ‘‘జాగ్రత్త’’గా ఉండాలని బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచనలు జారీ చేసింది. లెబనాన్‌లోని భారతీయ పౌరుల కోసం ఎంబసీ అత్యవసర ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని విడుదల చేసింది మరియు ఎంబసీతో టచ్‌లో ఉండాలని వారికి తెలిపింది. ‘‘cons.beirut@mea. gov.in లేదా అత్యవసర ఫోన్ నంబర్ +96176860128’’ లను అందుబాటులో ఉంచింది.

ఏ క్షణానైనా యుద్ధం జరిగే అవకాశం ఉండటంతో ప్రపంచం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అక్టోబర్ 07 నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైంది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేసే దాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయిల్ పలుమార్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే హమాస్‌కి ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా మద్దతు తెలియజేసింది. లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై తరుచుగా దాడులకు తెగబడుతోంది.