కెనడాలో దారుణం జరిగింది. భారతీయు మహిళ హిమాన్షి ఖురానా (30) హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానిత సన్నిహిత భాగస్వామి అబ్దుల్ గఫూరిపై టొరంటో పోలీసులు కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఆచూకీ తెలియజేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Bangladesh: ఉస్మాన్ హాదీని ప్రభుత్వమే చంపింది.. బాధిత సోదరుడు సంచలన ఆరోపణలు
హిమాన్షి ఖురానా ఇండో-కెనడియన్ డిజిటల్ సృష్టికర్త. డిసెంబర్ 20, 2025 శనివారం ఉదయం 6:30 గంటలకు ఒక నివాసంలో ఆమె డెడ్‌బాడీని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణాన్ని హత్యగా ధృవీకరించారు. అయితే బాధిత మహిళ-ఆమె అనుమానిత భాగస్వామి ఒకరినొకరు తెలిసినవారుగానే గుర్తించారు. అతడే చంపి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో అనుమానిత చిత్రాన్ని విడుదల చేశారు. అతడి ఆచూకీ తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఇది కూడా చదవండి: H-1B Lottery: H-1B వీసా దరఖాస్తుదారులపై మరో పిడుగు.. లాటరీ విధానం రద్దు
మహిళ హత్యపై టొరంటోలోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. ‘‘టొరంటోలో భారతీయురాలు హిమాన్షి ఖురానా హత్యతో తీవ్ర విచారానికి గురయ్యాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.’’ అని కాన్సులేట్ పేర్కొంది. కెనడియన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఖురానా కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామని తెలిపింది. టొరంటో పోలీసులు గఫూరిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.
