Indian Space Congress-2022: స్పేస్ టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇండియన్ స్పేస్ కాంగ్రెస్-2022 ప్రత్యేక చొరవ చూపుతోంది. వాటిని 1.5 ట్రిలియన్ డాలర్ల స్పేస్ ఎకానమీలో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించింది. షార్ట్ లిస్ట్ చేసిన 15 స్టార్టప్‌లకు ఫౌండర్స్ హబ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆ స్టార్టప్‌లు లక్షన్నర డాలర్ల వరకు విలువ చేసే ఉచిత అజూర్ క్రెడిట్‌ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫైనల్‌లో నిలిచిన 5 స్టార్టప్‌లు తమ ఐడియాలను ఇండస్ట్రీ లీడర్లతో, ఇన్వెస్టర్లతో షేర్ చేసుకోవచ్చు.
ఈ రోజు ఢిల్లీలోని హోటల్ లే మెరిడియెన్‌లో ఇండియన్ స్పేస్ కాంగ్రెస్-2022 ప్రారంభమైంది. ఇందులో భాగంగా రేపు గురువారం ‘‘పిచ్ రైట్ ఫర్ స్కైరాకెటింగ్ స్టార్టప్స్’’ పేరుతో ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది. ఇటీవల గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘‘ఐడీఈఎక్స్ 75 స్పేస్ ఛాలెంజెస్’’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియన్ స్పేస్ కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఇండియన్ స్పేస్ కాంగ్రెస్-2022లో 20 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు, 180 మంది ఉపన్యాసకులు పాల్గొంటున్నారు.
YouTube Ad Revenue: యూట్యూబ్‌కి రెవెన్యూ ‘‘యాడ్’’ అవ్వట్లే..
35 థీమ్యాటిక్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ మోడల్స్ గురించి, రెగ్యులేటరీ సంస్థ నుంచి ఎదురయ్యే ఛాలెంజ్‌ల గురించి చర్చిస్తారు. విదేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను, కొత్త స్టార్టప్‌ల వ్యవస్థాపకుల్లో ఆసక్తిని పెంపొందించటం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ను సాకారం చేయటంలో భాగంగా ఇలాంటి సదస్సులను ఏర్పాటుచేస్తున్నారు. ఇండియాలో న్యూ ఏజ్ స్పేస్ ఎకోసిస్టమ్‌ను నిర్మించటంపైన, స్పేస్ సెగ్మెంట్లలోని వివిధ అంశాలపైన 30 దేశాల స్పీకర్లు ప్రసంగాలు ఇస్తారు.
