Air Crash: సంజయ్ గాంధీ, విజయ్ రూపానీ, వైఎస్ఆర్.. విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు..
- సంజయ్ గాంధీ నుంచి విజయ్ రూపానీ వరకు..
- దేశంలో విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు..
- వైఎస్ఆర్, బాలయోగి కూడా విమాన ప్రమాదల్లో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అయితే, విజయ్ రూపానీలాగే గతంలో కూడా భారత రాజకీయ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు.
సంజయ్ గాంధీ (1980)
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడు, ఒకప్పుడు ఆమె రాజకీయ వారసుడిగా పరిగణించబడిన సంజయ్ గాంధీ జూన్ 23, 1980న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 33 ఏళ్ల ఆయన రెండు సీట్ల విమానం నడుపుతుండగా సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో టెస్ట్ ఫ్లైట్ కూలిపోయింది.
మాధవ్‌రావు సింధియా (2001)
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి, మాధవరావు సింధియా భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. గ్వాలియర్ రాజకుటుంబ సభ్యుడు. ఆయన సెప్టెంబర్ 30, 2001న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా భోగావ్‌లో జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో సింధియా మరణించారు. కాన్పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించడానికి ఆయన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్నవాళ్లందరూ మరణించారు.
జిఎంసి బాలయోగి (2002)
అప్పటి లోక్‌సభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకుడు జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్‌లో గాలిలో ఉండగానే మెకానికల్ ఫెయిల్యూర్ తలెత్తింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి (2009)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్‌లో మరణించారు. సెప్టెంబర్ 2, 2009న నల్లమల కొండలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగిన ఒక రోజు తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించారు.
దోర్జీ ఖండు (2011)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఏప్రిల్ 30, 2011న చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన వైమానిక ప్రమాదంలో మరణించారు. పవన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. ఐదు రోజుల తర్వాత శిథిలాలు కనుగొనబడ్డాయి.
ఓపీ జిందాల్, సురేందర్ సింగ్ (2005)
పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ మంత్రి ఓపీ జిందాల్, మాజీ కేంద్ర మంత్రి సురేందర్ సింగ్ (మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు)తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, మార్చి 31, 2005న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
గుర్నామ్ సింగ్ (1973)
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా మే 31, 1973న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
బల్వంత్రాయ్ మెహతా (1965)
గుజరాత్ రెండవ ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తు్న్న హెలికాప్టర్‌ని పాకిస్తాన్ కూల్చేసింది. 1965 యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం జెట్ పొరపాటున పౌర విమానాన్ని కూల్చివేసింది . మెహతా భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..