Indian Passengers: ముంబై నుంచి మాంచెస్టర్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో 13 గంటలపాటు చిక్కుకుపోయారు. ఆహారం, సాయం లేకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ ఎయిర్‌లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే వసతి కల్పించారని ఆరోపించారు.
తమ విమానం కువైట్‌లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ల్యాండింగ్‌కి 20 నిమిషాల ముందు ఫ్లైట్ డైవర్షన్ గురించి ప్రకటన వచ్చిందని, ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగినట్లు వారు తెలిపారు. గల్ఫ్ ఎయిర్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.