Site icon NTV Telugu

New York Incident: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య.. భర్త వేధింపులు భరించలేకే

Mandeep Kaur

Mandeep Kaur

Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఏడెనిమిదేళ్లు గడిచాయి.. ఇక రోజూ దెబ్బలు తినడాన్ని తట్టుకోలేనంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఆ యువతి చేసిన రోదన అందరితో కన్నీరు పెట్టిస్తోంది.

తన అత్తామామ బలవంతంగా తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని.. నాన్న.. నేను చనిపోతున్నాను, దయచేసి క్షమించండి అంటూ ఏడ్చింది. మన్ దీప్ కౌర్ కు 4,6 ఏళ్ల ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. దీంతో ఆడపిల్లలనే కంటున్నావంటూ భర్త, అత్తామామల వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ కు చరెందిన మన్ దీప్ కౌర్ కు రంజోధ్ సింగ్ సంధుతో 2015లో వివాహం అయింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం యూఎస్ఏ వెళ్లారు. పెళ్లైన మూడేళ్ల తరువాత మన్ దీప్ కౌర్ కూడా యూఎస్ఏ వెళ్లింది. గతంలో కూడా తమ కుమర్తెను తీవ్రంగా కొట్టాడని మన్ దీప్ కౌర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆగస్టు 4న తమ కుమర్తె మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Read Also: Blood Transfusion: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ నుంచి రక్తం.. బాలుడికి హెచ్ ఐవీ

మన్ దీప్ కౌర్ పోస్టు చేసిన వీడియోలో తన బాధనంతా వెళ్లకక్కింది. దాదాపు 5 రోజులు తనను ట్రక్కులో బంధించాడని.. మా నాన్న అతడిపై పోలీస్ కేసు పెట్టాడని.. ఆ సమయంలో అతడు నన్ను ప్రాధేయపడటంతో కేసు వాపస్ తీసుకున్నామని చెప్పింది. కొన్ని వీడియోల్లో మన్ దీప్ కౌర్ భర్త కొడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. తల్లిని కొడుతుంటే కుమార్తెలు ‘‘పాపా, నా మారో మమ్మా ను’’ (పాపా, అమ్మను కొట్టవద్దు) అంటూ అరుపులు వినిపిస్తుంటాయి. ఈ ఘటనపై జస్టిస్ ఫర్ మన్ దీప్ యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.

Exit mobile version