Canada: కెనడాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య జరిగింది. శుక్రవారం ఎడ్మింటన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని ఒక ముఠా కాల్చి చంపింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని హర్షన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.
Read Also: Waqf Board: రైతులు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. మహారాష్ట్రలో కొత్త వివాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ భవనంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. 107 అవెన్యూ వద్దకు చేరుకోగానే, అపార్ట్‌మెంట్ మెట్లపై హర్షన్‌దీప్ సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించాడు. ముగ్గురు సభ్యుల ముఠాలోని ఒక వ్యక్తి బాధుతుడు హర్షన్‌ని మెట్లపై నుంచి కిందికి తోయగా, మరొకరు వెనక నుంచి కాల్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
ఇవాన్ రైన్, జుడిత్ సాల్టోక్స్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు మోపారు. హర్షన్ దీప్ సింగ్ హత్య ఈ వారంలో రెండోది. దీనికి ముందు కెనడాలోని అంటారియోలోని లాంబ్టన్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థి గురాసిస్ సింగ్(22)ని అతడి హౌజ్‌మేట్ కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని 36 ఏళ్ల క్రాస్లీ హంటర్‌గా తేల్చారు. ఇతడిపై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపారు. ఇద్దరు వ్యక్తులు వంటగదిలో వాగ్వాదానికి పాల్పడ్డారని, ఆ సమయంలో హంటర్ సింగ్‌ని కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తేలింది.
https://twitter.com/401_da_sarpanch/status/1865562879455617096
