NTV Telugu Site icon

Bihar: భారతీయ ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి కావాలి.. ప్రొఫెసర్ వివాదస్పద పోస్ట్..

Bihar

Bihar

Bihar: బీహార్ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జేపీ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్‌గా ఉన్న ఖుర్షీద్ ఆలం అనే ప్రొఫెసర్ ‘భారత ముస్లింలకు ప్రత్యే మాతృభూమి కావాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఖుర్షీద్ ఆలం తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. రాజ్యాంగం తనకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.

Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..

ఖుర్షీద్ ఆలం చేసిన పోస్టుపై విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో అతను తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇతను జై ప్రకాష్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తు్న్నాడు. సోషల్ మీడియా వేదిక భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ‘‘యునైటెడ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జిందాబాద్’’ అని రాశాడు. భారతీయ ముస్లింలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను అనుకుని మరో మాతృభూమిని కోరుకుంటున్నారు అని రెండు రోజుల క్రితం పోస్ట్ చేయడం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇతని పోస్టుపై విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దేశవ్యతిరేక నినాదాలకు పాల్పడినందుకు యూనివర్సిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చివరకు ప్రొఫెసర్ తన పదవికి రాజీనామా చేశారు.