NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ.. డిమాండ్లు ఇవే!

Mdodi

Mdodi

ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.

ఇది కూడా చదవండి: Fire Accident in Tirumala: టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం.. పలు ఫైల్స్ దగ్ధం..!

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటలు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగనుంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యూ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆస్పత్రుల్లో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Siddaramaiah: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తప్పికొడతాం

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది.