Site icon NTV Telugu

Maha Kumbh Mela 2025: గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా

Mahakumbhmela

Mahakumbhmela

మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఒక గ్రీకు యువతి-యూపీ కుర్రాడిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇలా కుంభమేళా వింతలకు వేదిక అవుతోంది.

యూపీకి చెందిన సిద్ధార్థ్ అనే కుర్రాడు, గ్రీస్‌కు చెందిన పెనె‌లోప్ అనే యువతి.. ఇద్దరూ ఇష్టపడ్డారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో సాంప్రదాయ వైదిక ఆచారాలు అనుసరించి వివాహం చేసుకున్నారు.  వధువు కుటుంబం కన్యాదానం చేసింది. వివాహం అనంతరం స్వామి యతీంద్రానంద గిరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పెనెలోప్‌ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు భారతదేశంలో జరిగే వివాహానికి హాజరు కాలేదని తెలిపింది.  తాను పెళ్లి చేసుకునే సమయంలో కొంత దైవిక శక్తి గ్రహించినట్లు తెలిపింది. ఇక పెనెలోప్‌  బౌద్ధమతం నుంచి హిందూ మతంలోకి మారినట్లు తెలిపింది.  జనవరి 29న గంగా నదిలో  పవిత్ర జలంలో పుణ్యస్నానం ఆచరిస్తానని తెలిపింది.

 

Exit mobile version