NTV Telugu Site icon

ప్రేమకోసం దేశ సరిహద్దులు దాటి..

lovers

lovers

ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటాడు.. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. మళ్లీ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్‌కు చిక్కాడు… దేశ సరిహద్దులు దాటిని ఆ లవ్‌ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్‌లోని న‌దియా జిల్లా బ‌ల్లావ్‌పూర్‌కు చెందిన జైకాంతో చంద్రరాయ్ అనే యువకుడికి బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో.. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు.. ఆ లోచన వచ్చిందే తడువు.. ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8వ తేదీన సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు చంద్రరాయ్… ఈ నెల 10వ తేదీన తన ప్రేయసి పరిణితిని పెళ్లిచేసుకున్నాడు.. 25వ తేదీ వ‌ర‌కు ఇద్దరూ క‌లిసి అక్కడే ఉండగా… జూన్‌ 26న తన భార్యతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యాడు. కానీ తన ప్రయాణం సాపీగా సాగలేదు.

భారత్‌లో అడుగుపెట్టేందుకు ఈసారి కూడా బ్రోకర్‌ సాయం తీసుకున్నాడు చంద్రరాయ్… బోర్డర్‌ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. కానీ, ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌కు ప‌క్కా సమాచారం అందడంతో.. అప్రమత్తమైన బ‌ల‌గాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. అయితే, విచారణలో వెలుగు చూసిన విషయాలతో షాక్ తింది బీఎస్ఎఫ్.. అబ్బాయిది ప‌శ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించాయి బీఎస్‌ఎఫ్‌ బలగాలు..