Iran-India: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాప పుస్తకంలో సంతకం

  • ఖమేనీ మృతిపై భారత ప్రభుత్వం సంతాపం
  • ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి సంతాపం
Iranindia2

Iranindia2

గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ హతం చేసింది. ఆయన చనిపోయినట్లుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కానీ భారత ప్రభుత్వం ఖండించలేదు. సంతాపం వ్యక్తం చేయలేదు. దీంతో కేంద్రం తీరును కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. ఖమేనీ మృతికి ఎందుకు సంతాపం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కాలమ్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపింది.

తాజాగా 6 రోజుల తర్వాత ఖమేనీ మృతి పట్ల భారత ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెళ్లారు. ఇరాన్ రాయబార కార్యాలయంలోని సంతాప పుస్తకంలో సంతకం చేసి హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి సంతాపం తెలిపారు. ఇక ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఇరాన్ జెండాను సగానికి అవనతం చేసింది.

ఇది కూడా చదవండి: Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!