Site icon NTV Telugu

Delhi: పాక్ సెలబ్రిటీలకు భారత్‌ బిగ్‌ షాక్.. సోషల్‌ మీడియా ఖాతాలు మళ్లీ బ్యాన్

Pakistansocialmediaban

Pakistansocialmediaban

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే తిరిగి భారత్‌లో ప్రత్యక్షమయ్యాయి. భారతీయులంతా ఆశ్చర్యపోయారు. దీంతో భారతప్రభుత్వం అప్రమత్తం అయింది. తాజాగా పాక్ సోషల్ మీడియా ఖాతాలను భారత్ నిషేధించింది. హనియా అమీర్, షాహిద్ అఫ్రిది, మహీరా ఖాన్ వంటి పాకిస్థాన్‌ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ను బ్యాన్ చేశాయి. దీంతో వారి ఖాతాలు భారతీయులకు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: ఏంటి ఈ దూకుడు.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

బుధవారం భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెల్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. సబా కమర్, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, షాహిద్ అఫ్రిది, అహద్ రజా మీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్థానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. అదనంగా హమ్ టీవీ, ARY డిజిటల్, హర్ పాల్ జియో వంటి యూట్యూబ్ ఛానెల్‌లు కూడా మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. తిరిగి వాటిపై చర్యలు చేపట్టింది. గురువారం వాటిపై బ్యాన్ విధించినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: హనీమూన్‌ కి తీసుకెళ్లి భర్తను చంపిన సోనమ్ రఘువంశికి.. పిండదానం చేసిన మహిళలు

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారతప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌పై పాకిస్థాన్ సెలబ్రిటీలు లేనిపోని వార్తలు సృష్టించారు. దీంతో వెంటనే పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఖాతాలను బ్యాన్ చేశారు. ఉన్నట్టుండి బుధవారం భారత్‌లో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అలజడి రేగింది. తిరిగి పాకిస్థాన్ ఛానల్స్‌ను భారత్ పునరుద్ధరించిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై భారతప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వాటిన్నింటిపైనా బ్యాన్ విధించింది.

Exit mobile version