Site icon NTV Telugu

Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్‌గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..

Icg

Icg

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిని ‘బిపార్జాయ్’ తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధం అవతోంది. ఈ నెల 15న గుజరాత్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా తుఫాన్ గుజరాత్ తీరంపై విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో చేపలవేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఓ వైపు తుఫాన్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. ఇండియన్ కోస్టుగార్డు 50 మందిని సురక్షితంగా తీరానికి చేర్చింది. సముద్రంలో ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న సిబ్బందని విజయవంతంగా రెస్క్యూ చేసింది. తుఫాన్ నేపథ్యంలో వీరిందరి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండటంతో కోస్టుగార్డు వీరోచితంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్ లోని ద్వారక ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న వారిని తీరానికి తీసుకువచ్చింది.

Read Also: Free Aadhaar Update: ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే

సోమవారం సాయంత్ర ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో సోమవారం 26 మందిని, మంగళవారం 24 మంది సిబ్బందిని తరలించారు. 48 గంటల పాటు ఈ వీరోచిత రెస్క్యూ ఆపరేషన్ ను కోస్ట్ గార్డు నిర్వహించింది. రెండు బ్యాచుల్లో సిబ్బందిని ICG ALH ధ్రువ్ హెలికాప్టర్ల ద్వారా సముద్రంలోని జాక్ అప్ రిగ్ ‘కీ సింగపూర్’ నుంచి వీరందరిని కోస్ట్ గార్డు సురక్షితంగా తీరానికి చేర్చింది. అడ్వాన్సుడ్ లైట్ హెలికాప్టర్(ALH), నేవీ నౌకలు ఈ రెస్య్కూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

మరోవైపు అత్యంత తీవ్రమైన బిపార్జాయ్ తుఫాన్ గుజరాత్ తీరం వైపు దూసుకోస్తోంది. తుఫాన్ తీరాన్ని చేరే కొద్ది గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం ఉదయం దాదాపు ఉత్తరం వైపుగా కదులుతూ ఉత్తర-ఈశాన్య దిశలో సౌరాష్ట్ర,కచ్ జిల్లాలు, పాకిస్తాన్ తీరం మధ్యలో తుఫాన్ విరుచుకుపడనుంది. తీర ప్రాంతంలో గంటకు గరిష్టంగా 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్ నగర్, మోర్చి, జునాగర్, రాజ్ కోట్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.

Exit mobile version