Site icon NTV Telugu

UAE: కోట్లలో విరాళం ఇచ్చి 900 మంది ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త..

Firoz Merchant

Firoz Merchant

UAE: యూఏఈలో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు. 62 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్, ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని తన ‘ ది ఫర్గాటెన్ సొసైటీ’ సాయంతో 20,000 మంది ఖైడీలకు సాయం చేశారు. 2024లో ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా 1 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ. 2.5 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది 3,000 మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also: Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..

ఫిరోజ్ మర్చంట్ యూఏఈ అధికారులకు రూ. 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దుబాయ్ వేదికగా ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు. రంజాన్ సంరద్భంగా క్షమాపణ, దయతో ఈ సాయం చేస్తున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. విడుదలవుతున్న 900 మంది ఖైదీల్లో అజ్మాన్ నుండి 495 మంది ఖైదీలు, ఫుజైరా నుండి 170 మంది ఖైదీలు, దుబాయ్ నుండి 121 మంది ఖైదీలు, ఉమ్ అల్ క్వైన్ నుండి 69 మంది ఖైదీలు, రస్ అల్ ఖైమా నుండి 28 మంది ఖైదీలు ఉన్నారు. గూఢచర్యం, అక్రమ వలసలు, ఇతర కేసుల్లో చిక్కుకున్న భారతీయ ఖైదీలు 900 మందిని రంజాన్ మాసంలో వారి కుటుంబ సభ్యులతో కలపాలని ఫిరోజ్ మర్చంట్ ఈ సాయం చేస్తున్నారు. ఖైదీలకు విధించిన జరిమానాలను అతను తీర్చేసి, వారందరూ జైళ్ల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు.

ఖైదీల అప్పులను తీర్చడంతో పాటు వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా ఫిరోజ్ మర్చంట్ అందించారు. 2024లో మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఏఈ అంతటా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్‌తో కలిసి ఫిరోజ్ మర్చంట్ 20,000 మంది ఖైదీలకు సాయం చేశారు. ప్రభుత్వం అధికారులతో పాటు ఖైదీల ప్రశంసలను పొందారు. ఫర్గాటెన్ సొసైటీ ఛారిటీ ద్వారా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Exit mobile version