Site icon NTV Telugu

చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?

అరుణాచ‌ల్ ప్ర‌దేశ‌లోని సాంగ్‌పో న‌ది వ‌ద్ద ఔష‌ద మూలిక‌లు సేక‌రించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువ‌కుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది.  అత‌నితో పాటు మ‌రో వ్య‌క్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్ర‌య‌త్నించ‌గా జానీ యుయాంగ్ త‌ప్పించుకోగా మిరాయ్ త‌రోన్‌ను అప‌హ‌రించుకుపోయారు.  దీనిపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతున్న‌ది.  అయితే, భార‌త ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు.  మ‌రోవైపు చైనా అధికారుల‌తో భార‌త్ హాట్‌లైన్ ద్వారా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది.  ఈ కిడ్నాప్‌కు కార‌ణాలు ఏంటి అనే దిశ‌గా అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Read: సినిమా వాళ్లకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. డ్రగ్స్ వాడుతూ దొరికితే బొక్కలో వేస్తాం

వ‌న‌మూలిక‌ల‌ను సేక‌రించేందుకు వెళ్లిన  మిరాయ్ దారితప్పాడ‌ని, ప్రోటోకాల్ ప్ర‌కారం మిరాయ్‌ను భార‌త్ అప్ప‌గించాల‌ని అధికారులు చైనా అధికారుల‌ను కోరారు.  గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వానికి కొద్ది రోజుల ముందు జ‌రిగిన ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, మిరాయ్ కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని, మిరాయ్ కిడ్నాప్ వెనుక ప్ర‌ధాని మోడీ మౌనంగా ఉండ‌టం త‌గ‌ద‌ని, వెంట‌నే విడిపించే ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు.  అయితే, నిజంగానే చైనా ఆర్మీ మిరాయ్‌ను కిడ్నాప్ చేసిందా.. లేదా దారిత‌ప్పి మిరాయ్ చైనాలోకి ప్ర‌వేశించి ఆర్మీకి దొరికిపోయాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

Exit mobile version