NTV Telugu Site icon

India’s fighter Aircraft: భారత్‌ వైపు దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. వెంటనే గాల్లోకి యుద్ధ విమానం..!

Air Craft

Air Craft

India’s fighter Aircraft: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతుంది. బంగ్లాదేశ్‌ వాయుసేనకు చెందిన సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అలర్ట్ అయింది. పరిస్థితిని పరిశీలించేందుకు వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని పంపించింది. ఈ యుద్ధ విమానం.. బంగ్లాదేశ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తిరిగి ఆ దేశ ఎయిర్‌స్పేస్‌లోకి వెళ్లే వరకు ఓ కన్నేసి ఉంచినట్లు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన వర్గాలు వెల్లడించాయి.

Read Also: Kalinga : తన చెవిని తానే కోసుకుని తినేస్తున్న అమ్మాయి.. వామ్మో ఇదేం టీజర్ అయ్యా?

అయితే, రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో.. ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసింది. దీంతో పాలనా పగ్గాలను అక్కడి ఆర్మీ చేపట్టింది. హసీన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఆ దేశానికి విమాన సేవలతో పాటు రైల్వే సేవలను కూడా భారత ప్రభుత్వం నిలిపి వేసినట్లు వెల్లడించింది.