దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండటంతో వేగంగా వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నారు. దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో మూడు వ్యాక్సిన్లకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్‌లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ డేటాను ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీంచనున్నది. ఇది మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. దీని తరువాత కోవాక్స్, స్పుత్నిక్ లైట్‌ను పరిశీలించే అవకాశం ఉన్నది. ఈ మూడు ఆమోదం పొందితే ఈ ఏడాది చివరి వరకు దేశంలోని అందరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే వారం రోజుల వ్యవధిలోనే వీటికి అనుమతులు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో త్వరలో మరో మూడు టీకాలు…
