NTV Telugu Site icon

NSA Ajit Doval: సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే భారతదేశం విడిపోయేది కాదు..

Nsa Ajit Doval

Nsa Ajit Doval

NSA Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశ విభజన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశ విడిపోయేది కానది అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ.. నేతాజీ జీవితంలో వివిధ దశల్లో ధైర్యాన్ని ప్రదర్శించాని అననారు. మహాత్మా గాంధీని ఎదురించే దైర్యం సుభాష్ చంద్రబోస్ కి ఉందని ఆయన అన్నారు.

Read Also: Uganda: స్కూల్‌పై టెర్రరిస్టుల దాడి.. 37 మంది విద్యార్థుల ఊచకోత..

నేను స్వాతంత్య్రం కోసం ఎవరిని అడుక్కోను అనే సిద్ధాంత నేతాజీది అని.. నేను బ్రిటీష్ వారితో పోరాడుతాను కానీ.. స్వాతంత్య్రాన్ని అడుక్కోనని.. అది నా హక్కు అని నేతాజీ భావించారని.. సుభాష్ చంద్రబోస్ ఉండి ఉంటే భారతదేశం విభజించబడేది కాదని అన్నారు. గతంలో పాకిస్తాన్ జాతిపిత కూడా సుభాష్ చంద్రబోస్ ని ప్రశంసించారని తెలిపారు. ‘‘నేను ఒక నాయకుడిని మాత్రమే అంగీకరించగలను, అది సుభాష్ చంద్రబోస్’’ అని జిన్నా అన్నారని అజిత్ దోవల్ తెలిపారు.

పూర్తి స్వాతంత్య్రం, స్వేచ్ఛ కంటే తక్కువైన దాని కోసం నేను పోరాడనని, ఈ దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి చేయడమే కాకుండా, ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని నేతాజీ భావించారని దోవల్ చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆగస్ట్ 18, 1945న అదృశ్యమయ్యారు. తైవాన్ లో జరిగి విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు. అయితే నేతాజీ మరణంపై భిన్నవాదనలు ఉన్నాయి.