S Jaishankar: దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఏది సరైందో అదే చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎంపికలపై ఇతరులకు వీటో అధికారం కలిగి ఉండడాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని చెప్పుకొచ్చారు. జాతీయ, ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అనారోగ్యకరమైన అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వాతావరణ మార్పులతో ప్రపంచం పోరాటం చేస్తుందన్నారు. ఇక, గ్లోబలైజేషన్, టెక్నాలజీలపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కేంద్రమంత్రి జై శంకర్ పిలుపునిచ్చారు.
Read Also: DaakuMaharaaj : చిన్నిలిరికల్ సాంగ్ ముహూర్తం ఫిక్స్
అయితే, భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. కానీ, భారతీయతను కోల్పోకుండా ముందుకు కొనసాగాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. అప్పుడే మనం ప్రపంచంలో అగ్రగామి శక్తిగా ఎదుగుతామని తెలిపారు. భారతదేశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ.. ముందుకు కొనసాగుతుందన్నారు. ఇక,గత దశాబ్ద కాలంగా భారత్ మరింత పురోగమించింది జై శంకర్ తెలిపారు.