India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..

  • భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారైందన్న పీయూష్ గోయల్
  • ప్రస్తుతం న్యాయపరమైన ముసాయిదా, తుది నిబంధనల రూపకల్పన
India Us Trade Deal

India Us Trade Deal

India-US Trade Deal: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో తొలి దశ ఖరారైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యాయపరమైన ముసాయిదా రూపకల్పన, తుది వివరాలు ఖరారు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు మెరుగైన సంకాల ప్రయోజాలను లభించేలా ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎస్ఆర్సీసీ శతాబ్ధి సదస్సులో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. అమెరికాలో మొత్తం సుంకాల వ్యవస్థకు సంబంధించిన స్పష్టత వచ్చిన తర్వాతే ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా చేపడుతున్న సెక్షన్ 301 చర్యల తర్వాత, సుంకాల నిర్మాణంలో మార్పులు పరిగణలోకి తీసుకుని ఇరు దేశాలు అంగీకారంతో సంతకాలకు తగిన సమయం నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.