NTV Telugu Site icon

Bharatiya Antriksh Station: 2035 నాటికి భారత్‌కి సొంత ‘‘అంతరిక్ష కేంద్రం’’

Bharatiya Antriksh Station

Bharatiya Antriksh Station

Bharatiya Antriksh Station: భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని, దీనిని ‘‘భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్’’ అని లుస్తామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) , బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) మధ్య బయోటెక్నాలజీని, స్పేస్ టెక్నాలజీలో అనుసంధానం చేసే జరిగిన కీలకమైన ఒప్పందంలో సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ‘భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్’ స్థాపించడం, ‘బయోఈ3’ (ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం,ఉపాధి కోసం బయోటెక్నాలజీ) విధానాన్ని ఆవిష్కరించడం వంటి కీలక కార్యక్రమాలపై ఎంఓయూ కుదిరింది.

Read Also: India At UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..

ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఒప్పందం మైక్రోగ్రావిటీ రీసెర్చ్, స్పేస్ బయోటెక్నాలజీ, స్పేస్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయో ఆస్ట్రోనాటిక్స్, స్పేస్ బయాలజీ వంటి రంగాలపై దృష్టి పెడుతుంది. ఈ సహకారం సాధ్యమయ్యేలా కృషి చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలేలను మంత్రి అభినందించారు. భారత అంతరిక్ష రంగం వేగమైన వృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కీలకమని మంత్రి అన్నారు. స్పేస్ స్టార్టప్స్‌లు గణనీయంగా పెరిగాయని, దాదాపు 300 స్టార్టప్స్ ఇప్పుడు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని చెప్పారు.

సెప్టెంబర్‌లో కేంద్ర క్యాబినెట్ చంద్రుడిపైకి వెళ్లే నాలుగో మిషన్‌కి ఆమోదం తెలిపింది. 2028 నాటికి భారతీయ అంత్రిక్ష్ స్టేషన్ (BAS) యొక్క మొదటి యూనిట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి తొలి భారతీయుడు చంద్రుడిపై ల్యాండ్ చేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం నాసాకి, చైనా స్పేస్ ఏజెన్సీకి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.