Site icon NTV Telugu

Pralay Missiles: “ప్రళయ్” మిస్సైల్ టెస్ట్ విజయవంతం.. దీని ప్రత్యేకతలు ఇవే..

Pralay

Pralay

Pralay Missiles భారత్ బుధవారం రెండు ప్రళయ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుండి స్వల్ప వ్యవధిలో రెండు ప్రళయ్ క్షిపణులను సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేశారు. ఒడిశా తీరంలో ఈ టెస్ట్ జరిగింది. ప్రళయ్ స్వదేశీగా అభివృద్ధి చేసిన క్వాజి-బాలిస్టిక్(పాక్షిక-బాలిస్టిక్) మిస్సైల్. దీనికి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం ఉంది. దీంట్లో అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ ఉంది. దీంతోనే ఖచ్చితమైన దాడులు చేయగలదు. వివిధ లక్ష్యాలపై బహుళ రకాల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.

Read Also: Bandi Sanjay: బెంగాల్ తరువాత తెలంగాణే టార్గెట్.. పార్టీ వ్యూహం ఇదే..

ఈ క్షిపణుల పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిర్వహించింది. రెండు క్షిపణులు నిర్దేశించని ట్రాజెక్టరీలో ప్రయాణించాయి. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మోహరించిన ట్రాకింగ్ సెన్సార్లు మిస్సైళ్లు అన్ని లక్ష్యాలను సాధించినట్లు ధ్రువీకరించాయి.

క్షిపణి పరీక్ష విజయవంతం తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ, భారత వైమానిక దళం, భారత సైన్యం, డీపీఎస్‌యూలు మరియు పరిశ్రమలను అభినందించారు. డీఆర్‌డీఓ పరిశోధన-అభివృద్ధి విభాగానికి చెందిన చైర్మన్ సమీర్ కామత్ కూడా ఈ పరీక్షకు సంబంధించిన డీఆర్‌డీఓ బృందాలను అభినందించారు.

Exit mobile version