Site icon NTV Telugu

India: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్‌

Agni2

Agni2

భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని రక్షణ వ్యవస్థ పరీక్షించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కదిలే రైలు నుంచి క్షిపణి ప్రయోగాన్ని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైలు నుంచి అగ్ని-ప్రైమ్ గర్జిస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు

ఈ క్షిపణి 2,000 కి.మీ వరకు దాడి చేసే సామర్థ్యం ఉంది. నేటి కాలంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి. అధునాతన లక్షణాలతో ఈ క్షిపణిని రూపొందించారు. ప్రత్యేకంగా రైలు ఆధారిత వ్యవస్థ నుంచి ప్రయోగించేలా రూపొందించారు. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ విజయంపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), సాయుధ దళాలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

అగ్నిప్రైమ్‌ మిసైల్‌ అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. ఇందులో రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత ఇనర్షల్‌ నేవిగేషన్‌, మైక్రో ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. అలాగే జీపీఎస్‌, నావిక్‌ శాటిలైట్‌ నేవిగేషన్లకు కూడా వాడుకొనే ఆప్షన్‌ ఉంది. కెనిస్టర్‌ డిజైన్‌ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపర్చవచ్చు.

Exit mobile version