Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni Missile: భారత అణ్వాస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థతో కూడిన అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ద్వారా క్షిపణి ఒకేసారి అనేక లక్ష్యాలపై వేర్వేరు ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులు చేయగలదు. శుక్రవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు చేసినట్లు డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. మిస్సైల్ మల్టిపుల్ పేలోడ్లతో ప్రయాణించి, నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.
Read Also: Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అగ్ని మిస్సైల్ సక్సెస్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సైన్యం, దేశీయ రక్షణ పరిశ్రమల్ని కొనియాడారు. ఈ పరీక్షతో భారత భద్రతా సామర్థ్యాలు మరింత బలోపేతమైనట్లు చెప్పారు. ప్రయోగ సమయంలో భూమిపై ఉన్న ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. క్షిపణి నింగికెగిసినప్పటి నుంచి లక్ష్యాలను ఛేదించే వరకు డేటాను సేకరించినట్లు డీఆర్డీఓ తెలిపింది.
మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థ అనేది ఒకే క్షిపణి ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని బహుళ లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థను ఛేదించడం మరింత సులువు అవుతుంది. ప్రపంచంలో కొద్ది దేశాల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఇదిలా ఉంటే, గురువారం డీఆర్డీఓ, భారత వైమానిక దళం టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (TARA) ఆయుధ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించాయి. ఇది సాధారణ ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం కలిగే ప్రెసిషన్ గైడెడ్ గ్లైడ్ వెపన్లుగా మార్చే ఒక స్వదేశీ సాంకేతికత.
Advanced Agni missile with MIRV (Multiple Independently Targeted Re-Entry Vehicle) system was successfully tested from Dr. APJ Abdul Kalam Island, Odisha on 08th May 2026.
The missile was flight tested with Multiple payloads, targeted to different targets spatially distributed… pic.twitter.com/W7ufT7pwbt
— DRDO (@DRDO_India) May 9, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!