Site icon NTV Telugu

India slams US: మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక.. ఎన్నికల్లో జోక్యం విజయవంతం కాదని భారత్ ఫైర్

Usa India

Usa India

India slams US: మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్-కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) విడుదల చేసిన నివేదికలోని అంశాలని భారత్ గురువారం తిరస్కరించింది. ఈ నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘‘రాజకీయ ఎజెండాతో కూడి పక్షపాత సంస్థ’’ అని పేర్కొంది. భారతదేశం యొక్క వైవిధ్యమైన, ప్రజాస్వామ్య తత్వాన్ని అర్థం చేసుకుంటుందని అమెరికా ప్రభుత్వ కమిషన్ నుంచి తమకు ఎలాంటి అంచనాలు లేవని భారత్ పేర్కొంది.

Read Also: Congress: ఒకే రోజు మిగిలి ఉంది.. అయేథీ, రాయ్‌బరేలీపై ఖర్గే, రాహుల్ గాంధీ చర్చలు..

USCIRF తన 2024 వార్షిక నివేదికను విడుదల చేసింది మరియు భారతదేశంతో సహా 17 దేశాలను ప్రత్యేక శ్రద్ధగల దేశాలుగా నియమించాలని సిఫారసులు చేసింది. మత స్వేచ్ఛపై తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో ఈ నివేదికపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వార్ మాట్లాడుతూ.. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించిందని USCIRFపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ఎజెండాతో పక్షపాత సంస్థగా పేరు తెచ్చుకుంది. వారు వార్షిక నివేదికలో భారత్‌పై దుష్ఫ్రచారాన్ని ప్రచురిస్తూనే ఉన్నారని జైశ్వాల్ అన్నారు.

సదరు అమెరికా సంస్థ భారత వైవిధ్యం, బహుళత్వ, ప్రజాస్వామిక తత్వాన్ని అర్థం చేసుకోవాలని, వారు అర్థం చేసుకుంటారనే అంచానాలు లేవని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వారి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావు అన్నారు. మణిపూర్, హర్యానా హింస, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై ప్రభుత్వం తీసుకున్న తర్వాత కాశ్మీరీ నేతలు, వేర్పాటువాదుల్ని నిర్భంధించడం వంటి ఉదహారణలను అమెరికా నివేదిక ఉదహరించింది.

Exit mobile version