India Set To Become World’s Third-Largest Economy By 2030: ప్రపంచదేశాలు అన్నీ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటే ఒక్క భారతదేశం మాత్రమే మాంద్యాన్ని తప్పించుకుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే బ్రిటన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. ఇదిలా ఉంటే 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఓ నివేదికలో పేర్కొంది. ‘‘ వై దిస్ ఈస్ ఇండియా డికేడ్’’ పేరుతో రూపొందించిన నివేదికలో భారత ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్తును వివరించింది.
తయారీ రంగం, ఇంధన రంగం, దేశంలోని డిజిటల్ రంగంలో పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వృద్ధి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ దశాబ్ధం చివరి నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని తెలిపింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని పేర్కొంది. ఈ విలక్షణమైన మార్పులు, ఒక జనరేషన్ లో జరిగే మార్పులను, పెట్టుబడులు, అవకాశాలను సూచిస్తాయని నివేదిక పేర్కొంది. జనాభా, డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీగ్లోబలైజేషన్ ఈ నాలుగు అంశాలు భారతదేశానికి సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ దశాబ్ధం నాటికి ప్రపంచవృద్ధిలో ఐదవవంతు భారత్ కలిగి ఉంటుందని పేర్కొంది.
Read Also: Twitter: ట్విట్టర్‌లోకి టెస్లా ఉద్యోగులు.. కీలక చర్య దిశగా ఎలాన్ మస్క్
ఏడాదికి 35,000 డాలర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబాల సంఖ్య రాబోయే దశాబ్ధంలో ఐదు రెట్టు పెరిగి 25 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 2031 నాటికి జీడీపీలో 7.5 ట్రిలియన్ డాలక్లకు డబుల్ అవుతుందని అంచానా వేసింది. రెండు ఏళ్ల కరోనాలో భారతదేశంలోని పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 4.3 మిలియన్ల నుంచి 5.1 మిలియన్లకు పెరిగిందని.. ప్రపంచ సర్వీస్ సెక్టార్ల లో దేశం వాటా 60 బేస్ పాయింట్లు పెరిగి 4.3 శాతానికి చేరుకుందని పేర్కొంది. డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ పాత్రను కూడా ప్రశంసించింది. వచ్చే పదేళ్లో ఇంధన రంగంలో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది.
2031 నాటికి భారత జీడీపీలో తయారీ వాటా 21 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఇది 1 ట్రిలియన్ డాలర్లకు సమానం. భారత ఎగుమతులు 2031 నాటికి 4.5 శాతానికి రెట్టింపు అవుతుందని.. ఇది 1.2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతి అవకాశాలను అందిస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 650 మిలియన్ల నుంచి 960 మిలియన్లకు పెరుగుతుందని..ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య 250 మిలియన్ల నుంచి 700 మిలియన్లకు పెరుగుతాయని అంచానా. 2021-30లో గ్లోబల్ కార్ల అమ్మకాల్లో దాదాపుగా 25 శాతం భారతదేశం నుంచి జరుగుతాయని.. 2030 నాటికి ప్యాసింజర్ వాహానాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అంచానా వేసింది.