NTV Telugu Site icon

Bird flu: ఏపీలో 8 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. సంచలన రిపోర్ట్..

Bird Flu

Bird Flu

Bird flu: ఆంధ్రప్రదేశ్‌లో 8 ప్రాంతాల్లో కోళ్ల ఫామ్స్, ఇంట్లో పెంచుకునే కోళ్లలో వ్యాధికారక H5N1 బర్డ్ ఫ్లూ నమోదైనట్లు భారతీయ అధికారులను ఉటంకిస్తూ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా వ్యాప్తిని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలో గుర్తించినట్లు పారిస్‌కి చెందిన సంస్థ తన నివేదికలో తెలిపింది. దీని వల్ల 6,02,000 కోళ్లను చంపేసినట్లు చెప్పింది.