NTV Telugu Site icon

భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. మళ్లీ భారీగా పాజిటివ్‌ కేసులు

COVID 19

COVID 19

భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. గత బులెటిన్‌లో 30 వేలకు దిగువకు వెళ్లిపోయిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఏకంగా 43 వేలు దాటేశాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,36,857 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకేరోజు 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.14 కోట్లకు చేరగా.. 4,22,022 మంది మృతిచెందారు.. ఇక, తాజాగా మరో 41,678 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 3.06 కోట్లకు చేరింది. ప్రస్తుతం 3,99,439 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉండగా.. మరోవైపు ఇప్పటివరకు 44,61,56,659 టీకాలు వేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.