Site icon NTV Telugu

భార‌త్‌లో త‌గ్గిన క‌రోనా.. అయినా భారీగానే..

Covid

భార‌త్‌లో ఒమిక్రాన్ ఎంట్రీతో కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ప్రారంభ‌మైంది.. భారీగా స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వ‌రుస‌గా మూడో రోజు కూడా 3 ల‌క్ష‌ల‌కు పైగానే కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.. కానీ, నిన్న‌టి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు త‌గ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 19 ల‌క్ష‌ల‌కు పైగా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 3,37,704 మందికి కోవిడ్ నిర్ధార‌ణ అయ్యింది.. దీంతో.. పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరింది.. ఇక‌, మ‌రో 488 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వ‌దిలారు.. ఇదే స‌మ‌యంలో 2,42,676 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నార‌ని.. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,13,365గా ఉంద‌ని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.

Read Also: సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ‌.. ఆ అధికారం మీకు ఎక్క‌డిది..?

మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3.89 కోట్ల‌ను దాటేయ‌గా.. 4,88,884 మంది ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు.. మ‌రోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభ‌ణ కూడా కొన‌సాగుతూనే ఉంది.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటేసి.. 10,050కు చేరింది.. అయితే, వాస్త‌వంగా అయితే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగాఉంటుంద‌ని.. భార‌త్‌లో కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌కు కార‌ణం ఇదే అంటున్నారు వైద్య నిపుణులు.

Exit mobile version