NTV Telugu Site icon

COVID19: ముంచుకొస్తున్న ఫోర్త్ వేవ్.. కొత్తగా 17,073 కరోనా కేసులు

Covid

Covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి మే వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి కేేసుల సంఖ్య పదివేలకు మించి నమోదు అవుతున్నాయి. తాజాగా సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 17,073 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆదివారంతో పోలిస్తే దాదాపుగా 45 శాతం పెరిగాయి. ఆదివారం రోజు 11,739 కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 21 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ 94,420గా ఉంది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 4.39శాతంగా ఉంటే.. వారానికి 3.30 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా గణాంకాలను పరిశీలిస్తే.. గత రెండేళ్లలో దేశంలో 4,27,87,606 మంది కరోనా బారినపడి కోలుకోగా.. 5,25,020 మహమ్మారి బారినపడి మరణించారు. మొత్తంగా రికవరీ రేటు 98.56 శాతంగా ఉంటే.. డెత్ రేట్ 1.21గా ఉంది. ఇదిలా ఉంటే ఇండియాలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు అర్హులైన వారికి 197 కోట్ల డోసులు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 2,49,646 మందికి వ్యాక్సినేషన్ చేశారు.

దేశంలో కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇక్కడే ఉంటున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య 400 మార్క్ ను దాటింది.