India On USCIRF: US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) భారతదేశంలో మైనారిటీల పరిస్థితిపై మరోసారి తప్పుగా నివేదించింది. భారత్‌లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోందని పేర్కొంది. అయితే, ఈ నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. USCIRFని ‘‘ఆందోళన కలిగించే సంస్థ’’గా గుర్తించాలని భారత్ నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్యానికి, సహనానికి నిలయంగా భారతదేశ స్థానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు విజయవంతం కావని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. USCIRF నివేదికను ‘‘ పక్షపాత, రాజకీయ ప్రేరేపితమైంది’’గా భారత్ చెప్పింది. భారతదేశంలోని సమాజాన్ని తప్పుగా చిత్రీకరించడాని ఉద్దేశపూర్వక ఎజెండానున ప్రతిబింబిస్తోంద MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
Read Also: USCIRF: భారత్‌లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి..
USCIRF తన 2025 నివేదిక భారతదేశంలో 2024లో మతపరమైన మైనారిటీపై దాడులు, వివక్షత పెరిగిందని ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను, ఇతర మైనారిటీలను బీజేపీ తప్పుగా చిత్రీకరించినట్లు చెప్పింది. సిక్కు వేర్పాటువాదుల హత్యల్లో భారత గూఢచార సంస్థ ‘రా’ పాల్గొందని, దానిపై ఆంక్షలు విధించాలని కోరింది. ఇది కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య గురించి సూచిస్తుంది. మత స్వేచ్ఛని ఉల్లంఘిస్తున్న భారత్‌ని ‘‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం’’గా గుర్తించాలని, ట్రంప్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.