ఇప్పటి వరకు ఇండియా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో దిగుమతుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నది. అయితే, ఆత్మనిర్భర్‌లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పిన్స్‌కు ఎగుమతి చేసేందుకు ఒప్పదం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు. ఫిలిప్పిన్స్ రక్షణశాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆదేశ రక్షణశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. త్వరలోనే ఇండియా బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పిన్స్‌కు ఎగుమతికానున్నాయి. క్షిపణులతో పాటుగా ఇందులో వినియోగించే బ్యాటరీస్‌ను కూడా ఫిలిప్పిన్స్‌కు ఎగుమతి చేయనున్నది. బ్రహ్మోస్ క్షిపణులపై ఫిలిప్పిన్స్‌తో పాటు అనేక ఆసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బ్రహ్మోస్‌తో పాటు ఇతర ఆయుధాలను కూడా ఇండియా ఎగుమతి చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.
ఫిలిప్పిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు…డీల్ విలువ ఎంతంటే…
