NTV Telugu Site icon

India Most Polluted Cities: భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఏవో తెలుసా?

Most Polluted Cities Of India

Most Polluted Cities Of India

దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరీత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది.. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్ లోకి బాలాసోర్ నిలిచింది.. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది..

బాలాసోర్ గాలి నాణ్యత (ఏక్యూఐ) 406 పాయింట్లకు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది. దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ (371), బాలాపూర్ (359), బరిపద( 355), భీవాడి (349), ఛండీఘర్ (348), శ్రీ గంగానగర్ ( 346), రాజ్ఘర్ (339), హనుమాన్ ఘర్( 328), చప్రా (323), గురుగ్రామ్ (317), నోయిడా(318), ఘజియాబాద్(304) నగరాలు ఉన్నాయని తెలిపింది. ఇక, బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని ఈ నివేదిక తేల్చింది.

మరోవైపు నార్త్ రాష్ట్రాల్లోని పంట పొలాల వ్యర్థాల కాల్చివేతలు పెరుగుతున్నాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మధ్య పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 గుర్తించినట్లు తెలిపింది. పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది.. మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులు చూసిస్తున్నారు..