Site icon NTV Telugu

Missile test: బంగాళాఖాతంపై “నో-ఫ్లై” నోటీసులు జారీ.. మిస్సైల్ టెస్ట్‌కు భారత్ సిద్ధం..

Missile Test

Missile Test

Missile test: బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌ ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు నో-ఫ్లై జోన్ విస్తరించి ఉంది. డిసెంబర్ 6న 12:30 UTC నుండి డిసెంబర్ 8న 15:30 UTC వరకు ఈ నో – ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వులు చెప్పాయి.

నో ఫ్లై జోన్ బంగాళాఖాతంపై ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. ఇది క్షిపణి కార్యకలాపాల సమయంలో వాయు, సముద్ర భద్రతను నిర్ధారించడానికి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు ముందు భారత్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో 24 గంటల వ్యవధిలో మూడు అణ్వాయుధ సామర్థ్యం ఉన్న స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అయిన పృథ్వీ-II, అగ్ని-I, ఆకాష్ ప్రైమ్ క్షిపణులను ప్రయోగించారు.

Read Also: IND vs SA 2nd Test: ముగిసిన నాల్గవ రోజు ఆట.. టీమిండియా విజయానికి ఎన్ని పరుగులు అవసరమంటే..?

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాష్ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణుల్ని, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. జూలై 16న, భారత సైన్యం లడఖ్‌లో 4,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అప్‌గ్రేడ్ చేసిన ఆకాష్ ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది. తక్కువ ఆక్సిజన్ కలిగిన ఎతైన ప్రాంతాల్లో వాయు రక్షణ వ్యవస్థల్ని పరీక్షించారు. డీఆర్డీఓ డెవలప్ చేసిన ఆకాష్ ప్రైమ్ వ్యవస్థ మునుపటి ఆకాష్ వ్యవస్థకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది 30-35 కి.మీ పరిధిలో 18 నుంచి 20 కి.మీ ఎత్తులో యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల్ని, డ్రోన్లను నివారిస్తుంది. పృథ్వీ-II అనేది 350 కిలోమీటర్ల పరిధి సర్ఫేజ్ టూ సర్ఫేజ్ క్షిపణి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. అగ్ని-1 700 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది.

Exit mobile version