NTV Telugu Site icon

PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..

Pm Modi

Pm Modi

PM Modi: దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని పురాతన కాలంలో భారత్ వాణిజ్య శక్తిగా ఉన్న సమయంలోని ‘సిల్క్ రూట్’ వాణిజ్య కారిడార్‌ని గుర్తు చేశారు. ఇండియానే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ని ఇటీవల జరిగిన జీ20 సదస్సులో సూచించిందని ప్రధాని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత జరిగిన జీ20 సదస్సు ప్రతీ భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన పేర్కొన్నారు.

జీ20లో ఆఫ్రికా యూనియన్ సభ్యదేశంగా చేరడంతో భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని మోడీ అన్నారు. జీ20కి వేదికైన భారత మండపం సెలబ్రెటీగా మారిందని, ప్రతీ ఒక్కరు అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలులో సెల్పీలు తీసుకున్నారని ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటన దినోత్సవం వస్తుందని.. టూరిజంలో కనీస పెట్టుబడితో గరిష్ట ఉపాధిని సృష్టించవచ్చని తెలిపారు.

Read Also: JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..

జీ20 సమావేశాల వల్ల లక్ష మందికి పైగా విదేశీ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి భారత వైవిధ్యాన్ని, వారసత్వాన్ని చూశారని ప్రధాని వెల్లడించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో అనుబంధం ఉన్న శాంతినికేతన్, హోయసల ఆలయాలు ఇటీవల ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నిలవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. భారత్ లో 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, మరి కొన్నింటిని వారసత్వ ప్రదేశాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.

ప్రధాని ప్రస్తావించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ పై జీ20 సమావేశాల్లో అంగీకారం కుదిరింది. దీని ద్వారా అరబ్బు, మిడిల్ ఈస్ట్ దేశాలను అటు యూరప్ తో, ఇటు భారత్ తో కలపవచ్చు. ఈ ప్రాజెక్టులో భారీ రైలు, నౌక నిర్మాణ ప్రాజెక్టులు ఉండనున్నాయి. దీని ద్వారా నేరుగా భారత్ యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించవచ్చు. ఇది చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా, ఇండియా, ఇతర యూరప్ దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.

Show comments