2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దేశంలో పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రతిపక్ష కూటమి INDIA ఏర్పడిన తర్వాత.. 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం అయ్యాయి. మొదటి విపక్ష ఐక్య సమావేశం నితీష్ కుమార్-తేజస్వి యాదవ్‌ల ఆధ్వర్యంలో పాట్నాలో నిర్వహించారు. రెండవ సమావేశాన్ని కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించింది. ఇప్పుడు మూడవ సమావేశం మహారాష్ట్రలో జరగనుంది. ప్రతిపక్ష కూటమి (INDIA) ప్రతి నెలా ఒక రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Pilli Subhash Chandrabose: పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ
పాట్నాలో జరిగిన సమావేశంలో 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత జూలైలో కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో కూటమి పేరు ఖరారు చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఎదుర్కోవడానికి, ప్రతిపక్షాలు కూటమికి ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు విపక్షాల మూడవ సమావేశాన్ని మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించబోతోంది. అక్కడ భారత కన్వీనర్ పేరును ప్రకటించే అవకాశముంది.
BRO Pre Release Event Live: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్
ముంబైలో ప్రతిపక్ష కూటమి సమావేశం ఆగస్టు రెండు లేదా మూడో వారంలో జరగనుంది. ఈ సమావేశానికి శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ క్యాంప్) మరియు కాంగ్రెస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు పార్టీలు ఇప్పటికే మహారాష్ట్రలో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. బీజేపీని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, ఢిల్లీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.
