Jason Miller: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, తాజా భారత లాబీయిస్ట్ జాసన్ మిల్లర్ రంగంలోకి దిగారు. ఆయన ట్రంప్, ఆయన అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక వ్యక్తులను కలిశారు. ఈ నేపథ్యంలో, భారత్ – అమెరికా మధ్య మళ్లీ సంబంధాలు సాధారణం అవుతాయని తెలుస్తోంది. మిల్లర్ నేతృత్వంలోని SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థను భారత దౌత్య మిషన్, భారత లాబీయిస్టుగా ఏడాది ప్రారంభంలో 1.8 మిలియన్ విలువైన ఒప్పందం ద్వారా నియమించుకుంది.
Read Also: Allu Aravind: తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను వెంటాడిన మరో విషాదం
జేసన్ మిల్లర్ తన తాజా భేటీకి సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించకున్నా, ఆయన సోషల్ మీడియా ద్వారా ట్రంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ‘‘వాషింగ్టన్‌లో అద్భుతమైన వారం గడిపాను. చాలా మంది స్నేహితులు ఈ వారం నగరంలో ఉన్నారు. చివరగా మన కార్యనిర్వాహక అధ్యక్షుడిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది! మంచి పనిని కొనసాగించండి’’ అని ట్వీట్ చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందనే ఆరోపణలతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. ఇందులో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, 25 శాతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు.
