Site icon NTV Telugu

Hydrogen Rail: “హైడ్రోజన్ రైలు”తో చరిత్ర సృష్టించిన ఇండియన్ రైల్వే..

Hydrogen Rail

Hydrogen Rail

Hydrogen Rail: భారత రైల్వే చరిత్ర సృష్టించింది. గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా, భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్రువీకరించారు. ఆయన టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also: Landmine Blast: జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి

భారత్ ప్రస్తుతం 1,200 HP హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును అభివృద్ధి చేస్తోందని, ఇది హైడ్రోజన్ రైల్వే సాంకేతికతలో ప్రపంచ అగ్రదేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టే కీలక సంఘటన అని ఆయన పేర్కొన్నారు. “మొదటి హైడ్రోజన్-పవర్‌తో నడిచే కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ICFలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్-శక్తితో నడిచే రైల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంచుతుంది” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’’ చొరవ కింద 35 హైడ్రోజన్-పవర్డ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు 2023లో అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రతీ రైలుకు రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

Exit mobile version