Site icon NTV Telugu

Caste Census : దేశంలో తొలి డిజిటల్ జనగణన 2027లో..

Janaganana

Janaganana

Caste Census : కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న మూడు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ నిర్ణయాలలో దేశంలో జరగబోయే జనగణన (Census)కు సంబంధించిన కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. మంత్రి వైష్ణవ్ ప్రకటించిన వివరాల ప్రకారం, రాబోయే జనగణన దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ జనగణన కానుంది. ఈ జనగణన ప్రక్రియకు సంబంధించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా నిర్ణయించడం జరిగింది.

ఈ భారీ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది. ముఖ్యంగా, ఈసారి జరగబోయే జనగణనలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చారు. అదేమిటంటే, ఈసారి జనగణనలో కులం ఆధారిత గణనను కూడా చేర్చనున్నారు. ఈ చారిత్రాత్మక జనగణన నిర్వహణ కోసం కేంద్ర మంత్రివర్గం ఏకంగా రూ.11,718 కోట్లకు సంబంధించిన బడ్జెట్‌ను కూడా ఆమోదించింది.

కేబినెట్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాల గురించి మాట్లాడుతూ.. మంత్రి వైష్ణవ్ దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలను కూడా ప్రస్తావించారు. దేశంలో దేశీయంగా ఉత్పత్తి పెరగడం వలన, ఆర్థికపరమైన నిర్ణయాల సానుకూల ఫలితంగా దేశానికి సుమారు రూ.60,000 కోట్ల విదేశీ కరెన్సీ ఆదా అవుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Messi Match: మెస్సీ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత.. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్‌లతో నిఘా

Exit mobile version