Site icon NTV Telugu

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో జాప్యం.. ఫ్రెంచ్‌ కంపెనీకి భారత్‌ జరిమానా..

rafael war flight

36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్‌సెట్ బాధ్యతలను ఆలస్యం చేసినందుకు గాను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం జరిమానా విధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూరో 7.8 బిలియన్ల ఒప్పందంలో ఆఫ్‌సెట్ హామీలను నెరవేర్చడంలో జాప్యం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది.

ఫ్రెంచ్-భారత ప్రభుత్వాలు సెప్టెంబరు 2016లో యూరో 7.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ విలువలో 50 శాతం డస్సాల్ట్ ఏవియేషన్ తో పాటు దాని భాగస్వాములు సఫ్రాన్, థేల్స్ ద్వారా ఏడేళ్లలో ఆఫ్‌సెట్ చేయబడి, అమలు చేయబడాలి.

ఆఫ్‌సెట్‌లను అమలు చేయడానికి, మూడు సంస్థలు 70 కంటే ఎక్కువ భారతీయ కంపెనీలు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో జతకట్టాయి. స్టెల్త్ సామర్థ్యాలు, రాడార్, ఏరోస్పేస్ ఇంజన్లు, క్షిపణుల కోసం థ్రస్ట్ వెక్టరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ కోసం మెటీరియల్‌లకు సంబంధించిన అనేక సాంకేతికతలను ఫ్రెంచ్ వ్యాపారాల నుండి డీఆర్‌డీవో కోరుకుంటోందని ఇండియాలోని ఒక సీనియర్ రక్షణ శాస్త్రవేత్త చెప్పారు.

Exit mobile version