Site icon NTV Telugu

వాటిపై ఆంక్ష‌లు మ‌ళ్లీ పొడిగింపు…

క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర పౌర విమానయానా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  అంత‌ర్జాతీయ విమానస‌ర్వీసుల‌పై నిషేధాన్ని మ‌రోసారి పొడిగించింది.  ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఆంక్ష‌లను పొడిగించారు.  ప్ర‌స్తుతం జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు నిషేధం అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో డీజీసీఏ ఆంక్ష‌ల‌ను మ‌రోసారి పొడిగించాల‌ని నిర్ణ‌యించింది.  ఒమిక్రాన్‌కు ముందు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో డిసెంబ‌ర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను న‌డపాల‌ని నిర్ణ‌యించారు.  

Read: మార్చి నాటికి కరోనా కథకు ‘శుభం’ కార్డు: ఐసీఎంఆర్

కానీ, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి పెర‌గ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొని ఆంక్ష‌ల‌ను పొడిగించింది.  2020 మార్చి నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను భార‌త్ నిషేధించింది.  అయితే, వందే భార‌త్ మిష‌న్ కింద ఎయిర్ బ‌బుల్ ఏర్పాటు చేసి 40 దేశాల‌కు మాత్ర‌మే విమానాల‌ను న‌డుపుతున్న‌ది.  ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులోకి రావ‌డంతో విమానయాన సంస్థ‌లు మ‌రింత‌గా న‌ష్టపోయే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు పేర్కొన్నారు.  

Exit mobile version