Site icon NTV Telugu

ఇండియాలో కొత్తగా 7,447 కేసులు నమోదు

ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెంచారు.. ఇదే పమయంలో 7,886 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 86,415 యాక్టివ్‌ కేసులు ఉండగా… ఇప్పటి వరకు క‌రోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,41,62,765 కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,76,869 కి పెరిగినట్టు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 1,35,99,96,267 వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 92 కు చేరింది.

Exit mobile version