NTV Telugu Site icon

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

corona

ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 2,59,591 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,60,31,991 కి చేరింది. ఇందులో 2,27,12,735 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,27,925 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,209 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,91,331 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,57,295 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం.