Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేట్ః త‌గ్గిన కేసులు…పెరిగిన మ‌ర‌ణాలు…

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న స‌మ‌యంలో రోజుకు ముడు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేల‌కు ప‌డిపోయింది.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 70,421 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది.  ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కారోనాతో 3921 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,74,305 మంది క‌రోనాతో మృతి చెందారు.  ఇక ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 1,19,501 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.  

Exit mobile version