ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 39,361 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 35,968 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,05,79,106కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 416 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,20,967 మంది మృతి చేందారు. ఇక దేశంలో 4,11,189 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఇండియాలో ఇప్పటి వరకు 43,51,96,001 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…

India Covid 19